సూపర్ డ్యాన్సర్ డ్యాన్స్ కాంపిటీషన్ సీజన్ 2 ప్రారంభం
- December 12, 2023
దోహా: సూపర్ డ్యాన్సర్ డ్యాన్స్ కాంపిటీషన్ సీజన్ 1 అద్భుతమైన విజయం సాధించింది. దీంతో దోహా మ్యూజిక్ లవర్స్.. ఎమోట్ ఎడిషన్ డ్యాన్స్ స్టూడియోస్‌తో కలిసి సూపర్ డ్యాన్సర్ డ్యాన్స్ కాంపిటీషన్ సీజన్ 2ని ప్రారంభించింది. ప్రతిభావంతులైన డ్యాన్సర్లకు వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది వేదిక కానుంది. విభిన్న శ్రేణి నృత్య కళా ప్రక్రియలు, శైలులు, వినూత్నమైన కొరియోగ్రఫీ, అద్భుతమైన ప్రదర్శనలతో నృత్య ప్రియులను ఇది ఆకట్టుకోనుంది. ఇందులో విజేతలుగా నిలిచిన డ్యాన్లర్లకు, నృత్య బృందాలకు బహుమతులు అందజేయనున్నారు. ఎమోట్ ఎడిషన్ డ్యాన్స్ స్టూడియోస్‌తో కలిసి సూపర్ డ్యాన్సర్ డ్యాన్స్ కాంపిటీషన్ సీజన్ 2ని ప్రారంభించడం పట్ల తాము సంతోషంగా ఉన్నామని, సీజన్ 1కి అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత, సీజన్ 2ని మరింత ఎలక్ట్రిఫైయింగ్, చిరస్మరణీయంగా మార్చడానికి తాము ప్రేరణ పొందినట్లు దోహా మ్యూజిక్ వ్యవస్థాపకుడు సయ్యద్ రఫీ తెలిపారు. ఈ ఈవెంట్ కిక్‌ఆఫ్ కోసం నృత్య ప్రియులు, మద్దతుదారులు, సాధారణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఎమోట్ ఎడిషన్స్‌కు చెందిన జ్యోతి సంగీత తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు జిష్ణు, కృష్ణ ఉన్ని, నూర్ అఫ్షాన్, మొహిందర్ జలంధరి, జై ప్రకాష్ సింగ్, రీనా దానావో, జావేద్ బజ్వా, సారా అలీఖాన్, మధు, ముకర్రం, ఆసిం తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
_1702381666.jpg)
_1702381750.jpg)
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







