మదీనా కొత్త అమీర్‌గా ప్రిన్స్ సల్మాన్ బిన్ సుల్తాన్
- December 13, 2023
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్.. యువరాజు సల్మాన్ బిన్ సుల్తాన్‌ను మంత్రి హోదాలో మదీనా ప్రాంతానికి కొత్త అమీర్‌గా నియమించారు. ఈ మేరకు మంగళవారం ఉత్వర్వులు జారీ చేశారు. అలాగే మదీనా ఎమీర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్‌ను మంత్రి హోదాలో రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడికి ప్రత్యేక సలహాదారుగా నియమించారు.దీంతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు కొత్త డిప్యూటీ ఎమిర్‌లుగా నియమించారు. ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ కింగ్ అబ్దుల్ అజీజ్ ఫౌండేషన్ ఫర్ రీసెర్చ్ అండ్ ఆర్కైవ్స్ (దారా) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. కింగ్ ఫహద్ నేషనల్ లైబ్రరీ ట్రస్టీల బోర్డు ఛైర్మన్‌గా ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్‌ను నియమిస్తూ క్రౌన్ ప్రిన్స్ ఉత్తర్వులు జారీ చేశారు. రాయల్ డిక్రీల ప్రకారం.. మక్కా డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ బదర్ బిన్ సుల్తాన్ స్థానంలో ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ నియమితులయ్యారు. ప్రిన్స్ అహ్మద్ బిన్ ఫహద్ బిన్ సల్మాన్ స్థానంలో ప్రిన్స్ సౌద్ బిన్ బందర్ తూర్పు ప్రావిన్స్‌కి కొత్త డిప్యూటీ ఎమిర్‌గా నియమితులయ్యారు. తబుక్ ప్రాంతానికి డిప్యూటీ ఎమిర్‌గా ప్రిన్స్ ఖలీద్ బిన్ సౌద్ బిన్ అబ్దుల్లా, ప్రిన్స్ మితేబ్ బిన్ మిషాల్, అల్-జౌఫ్ డిప్యూటీ ఎమిర్ మరియు ప్రిన్స్ ఖలీద్ బిన్ సత్తమ్ అసిర్ డిప్యూటీ ఎమిర్‌లను నియమించారు. హఫర్ అల్-బాటిన్ గవర్నర్ ప్రిన్స్ మన్సూర్ బిన్ ముహమ్మద్ స్థానంలో ప్రిన్స్ అబ్దుల్రహ్మాన్ బిన్ అబ్దుల్లా నియమితులయ్యారు. వీరితోపాటు డా. హిషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్, అంతర్గత సహాయ మంత్రి; డాక్టర్ ఖలీద్ బిన్ మొహమ్మద్, అంతర్గత శాఖ ఉప మంత్రి; ఖలీద్ బిన్ ఫరీద్, రాయల్ కోర్ట్ సలహాదారు; ఇంజినీర్ ఖలీల్ బిన్ ఇబ్రహీం, పారిశ్రామిక వ్యవహారాల కోసం పరిశ్రమ మరియు ఖనిజ వనరుల డిప్యూటీ మంత్రి; డాక్టర్ అబ్దుల్లా అల్-మగ్లౌత్, మీడియా సహాయ మంత్రి; ముసేద్ బిన్ అబ్దుల్ అజీజ్, మక్కా మేయర్; ఇంజినీర్ అబ్దుల్లా బిన్ మహదీ, అసిర్ ప్రాంతం మేయర్; ఇంటెలిజెన్స్ వ్యవహారాల జనరల్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ చీఫ్ డాక్టర్ యూసఫ్ బిన్ సయ్యా మరియు మానవ హక్కుల కమిషన్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ జుహైర్ అల్-జుమాన్ లను నియమించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష