నీలి రంగు నక్క
- June 28, 2015
పూర్వం దండకారణ్యంలో ఒక తిండిపోతు నక్క ఉండేది. దానికి చాలా ఆకలి ఎక్కువ. ఎప్పుడూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతూ సోమరిపోతులా ఉండేది. అయితే ఒకరోజు దానికి కొద్దిపాటి తిండి కూడా దొరకలేదు. ఎంత వెతికినా ఎక్కడా ఒక్క మాంసం ముక్క కూడా దొరకలేదు. దీంతో ఆడవి అంతా తిరిగి, తిరిగి అలసిపోయి చివరగా ఒక గ్రామానికి చేరింది. ఆ గ్రామంలోని ఒక ఇంటిలోనికి దూరి అక్కడ దొరికిందంతా తినాలని అనుకొంది. అయితే అది ఒక చాకలి వాని ఇళ్లు. ఆ చాకలి ప్రొద్దున్నే బట్టలుతుకుదామని ఒక బాణలి నిండా నీలిమందు కలిపి పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియని నక్క ఆది ఏదో తాగేది అనుకొని దానిలో నోరు పెట్టింది. ఇంతలో ఆ చాకలి తలుపు తీసుకొని బయటికి రాగా, నక్క కంగారుపడిరది. ఈ కంగారులో ఒళ్లు తూలి అది ఆ బాణలిలో పడిపోయింది. దానిలోంచి బయటికి రాలేక రాత్రంతా అందులోనే ఉండిపోవల్సి వచ్చింది. ఇంతలో తెల్లవారింది. చాకలి వాడు బాణలి వద్దకి వచ్చి చూడగా అందులో నక్క చచ్చిపోయిన దానిలా నటించింది. కదలకుండా, మెదలకుండా ఉన్న ఆ నక్కను చూసి చాకలి వాడు అయ్యో ఈ నక్క చనిపోయిందనుకుంటా అనుకొని అతి కష్టంపై దాన్ని బయటికి తీసి దూరంగా విసిరేశాడు. దాంతో బతుకు జీవుడా! అనుకొని నక్క అక్కడి నుండి అడవిలోకి పారిపోయింది. రాత్రంతా ఆ నీలిమందు నీటిలో నానిపోవడం వల్ల దాని శరీరం నీలి రంగులోకి మారింది. నీలిరంగులోకి మారిన నక్కకు ఒక పాడు ఆలోచన వచ్చింది. దాంతో వెంటనే దాన్ని అమలుపరచాలని వడి వడిగా అడవిలోకి పోయి, అక్కడ ఉన్న తన తోటి జంతువులన్నింటినీ పిలిచి, నాకు వనదేవత ఒక వరం ఇచ్చింది. దాంతో నాకు ఈ నీలిరంగు ప్రాప్తించింది. నేను మీలా మామూలు నక్కని కాదు. నాకు చాలా శక్తులున్నాయి. దాంతో నేను మిమ్మల్ని ఏమైనా చేయగలను. కానీ దేవత మాట ప్రకారం నేను ఈ అడవికి రాజునై మిమ్మల్నందర్నీ పాలించమని చెప్పింది అని వాటిని నమ్మించింది. దాంతో అప్పటి నుండీ ఆ అడవిలోని పులి, ఏనుగుల్లాంటి పెద్ద జంతువులతో సహా అన్ని జంతువులూ దాని మాట వింటూ దాన్ని రాజుగా భావించారు. అయితే ఈ నీలినక్క తన తోటి నక్కలనన్నింటినీ తన కింద బానిసలుగా చేసుకుని అనేక సపర్యలు చేయించుకుంటూ అతి హీనంగా చూడసాగింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. దాంతో దీని హింస పడలేక మిగిలిన నక్కలు విసిగిపోయి, ఒక ఆలోచన చేశాయి. దీని బండారం ఎలాగైనా బయటపెట్టాలని తలంచి ఒక ఉపాయం పన్నాయి. సహజంగా నక్కల్లో ఒకటి అరిస్తే, దాని వెనుకే మిగతా నక్కలు కూడా అరుస్తాయి. అది వాటి జాతి లక్షణం. అప్పుడు ఇది మనలా మామూలు నక్కనా? కాదా? అని తెలిసిపోతుంది. అది తెలిసిన మిగతా జంతువులు దీన్ని ఊరికూ వదిలిపెట్టవు. చంపిపారేస్తాయి. అని అడవి మధ్యలోకి పోయి నక్కలన్నీ అరవడం మొదలుపెట్టాయి. అప్పుడు ఈ నీలిరంగు నక్క కూడా దాని కపట నటనను మర్చిపోయి అది కూడా అరవడం మొదలుపెట్టింది. దాంతో మిగతా జంతువులు తమని మోసం చేసినందుకు దాని మీద దాడి చేసి చంపేసాయి. దీంతో మిగతా నక్కలకు ఈ నీలి రంగు నక్క పెట్టే నరకబాధ తప్పి మామూలుగా తమ జీవితం సాగించాయి.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







