బిల్లు చెల్లింపు కోసం నకిలీ మెసేజులు. మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- December 15, 2023
కువైట్: విద్యుత్ బిల్లును చెల్లించమని అడిగే నకిలీ సందేశాల గురించి ప్రజలను విద్యుత్తు, నీరు మరియు ఇంధనం మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అనేక మంది వ్యక్తులు తమ బిల్లును చెల్లించడానికి నకిలీ మెసేజులను, వాటిల్లో పేర్కొన్న లింకులను వినియోగించవద్దని హెచ్చరించింది. నివేదిక ప్రకారం, ఫోన్ ద్వారా పంపిన చెల్లింపు లింక్‌ల ద్వారా బిల్లులు చెల్లించమని కస్టమర్లు అందుకున్న కొన్ని సందేశాల గురించి మంత్రిత్వ శాఖ కొంతమంది కస్టమర్ల నుండి ఫిర్యాదులను అందుకుంది. ఆ మెసేజ్‌లలోని లింక్ ఫేక్ అని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చెల్లింపు చేసేటప్పుడు సరైన లింక్‌ను ఉపయోగించాలని వినియోగదారులను కోరింది.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







