ప్రభాస్ మారుతీ సినిమాలో తమిళ్ స్టార్ కమెడియన్..

- December 16, 2023 , by Maagulf
ప్రభాస్ మారుతీ సినిమాలో తమిళ్ స్టార్ కమెడియన్..

హైదరాబాద్: ప్రభాస్ వరుసగా భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో సలార్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత కల్కి సినిమాని కూడా లైన్లో పెట్టాడు. అయితే వరుస భారీ సినిమాల మధ్యలో ఓ మీడియం సినిమా కూడా చేస్తున్నాడు ప్రభాస్. కామెడీ సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు అధికారికంగా ఈ సినిమా గురించి ప్రకటించకపోయినా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరిగింది. షూటింగ్ నుంచి ఓ రెండు ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ సలార్ రిలీజ్ బిజీ, కల్కి షూటింగ్స్ లో ఉండటంతో మారుతి సినిమా హోల్డ్ లో పెట్టారు. త్వరలోనే ఈ సినిమా మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టనున్నారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వినిపిస్తుంది.

ప్రభాస్ మారుతీ సినిమాలో తమిళ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని యోగిబాబే స్వయంగా ఓ తమిళ్ ఇంటర్వ్యూలో తెలిపాడు. తెలుగులో ప్రభాస్ – మారుతీ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్.. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకి రాజా డీలక్స్ అని పేరు పెట్టినట్టు, హారర్ కామెడీ జానర్ లో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com