కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..
- December 16, 2023
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ కొనసాగుతోంది. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన రిప్లై కోసం కేటీఆర్ తహతహ లాడుతున్నందుకు మాట్లాడాల్సి వస్తుందన్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్యం స్ఫూర్తి అర్థం కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ కు అవకాశం కల్పించిందే కాంగ్రెస్ అని తెలిపారు. కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పేర్కొన్నారు. అవకాశం ఇస్తే కేసీఆర్ సింగిల్ విండో చైర్మన్ గా ఓడిపోయారని తెలిపారు.
కేసీఆర్ ను కేంద్రంలో షిప్పింగ్ శాఖ, కార్మిక శాఖ మంత్రిని చేసిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాకుండానే హరీశ్ రావుకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. పోతిరెడ్డిపాడుపై గతంలో టి.జనార్ధన్ రెడ్డి మాట్లాడారని తెలిపారు. జూన్ 2, 2014 నుంచి పదేళ్లపాటు జరిగిన విధ్వంసంపై చర్చించాలని సూచించారు. సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష