రియాద్‌లో మొదటి ఒపెరా హౌస్: సౌదీ
- December 16, 2023
రియాద్: సౌదీ అరేబియాలోని అపారమైన సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన దిరియా చారిత్రాత్మక క్వార్టర్స్‌లో రాయల్ దిరియా ఒపేరా హౌస్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించి దిరియా కంపెనీ, రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ సంయుక్తంగా ప్రణాళికలను ప్రకటించాయి. ఒపెరా హౌస్ రూపకల్పన కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్కిటెక్చరల్ సంస్థ అయిన స్నోహెట్టాతో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. రాయల్ దిరియా ఒపేరా హౌస్.. రాజ్యంలో ఒక మార్గదర్శక సాంస్కృతిక వేదిక కానుంది. ఇది దిరియాలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన అల్ తురైఫ్ సమీపంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ను దిరియా కంపెనీ చేపట్టగా.. రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC)చే నిర్వహిస్తుంది. ఇది సౌదీ అరేబియా సాంస్కృతిక మూలాలు, భవిష్యత్తు విజన్ కు ప్రతిబింబిస్తుందని రాష్ట్ర మంత్రి, రియాద్ సిటీ కోసం రాయల్ కమీషన్ సీఈఓ ఇబ్రహీం అల్-సుల్తాన్ తెలిపారు. సౌదీ వారసత్వాన్ని ఆధునికతతో విలీనం చేస్తూ రాయల్ దిరియా ఒపేరా హౌస్ కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







