కువైట్ లో 209 మంది నివాసితులు అరెస్ట్
- December 16, 2023
కువైట్: రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, సూపర్విజన్ అండ్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్, త్రిసభ్య కమిటీ చేపట్టిన సెక్యూరిటీ క్యాంపెయిన్ లో భాగంగా 209 మంది నివాసితులను అరెస్ట్ చేశారు. మహ్బౌలా, సబా అల్ నాసర్, షార్క్, హవల్లి మరియు ఫహాహీల్లో నిర్వహించిన తనిఖీలలో రెసిడెన్సీ, వర్క్ చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 162 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వివిధ గవర్నరేట్లలో లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న వివిధ మొబైల్ ఫుడ్ సంస్థల వద్ద రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 47 మందిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







