అయోధ్య రామ మందిరం ప్రారంభానికి ప్రముఖులకు ఆహ్వానం
- December 17, 2023
అయోధ్య: అయోధ్యలో రామమందిర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి కావచ్చని తెలుస్తోంది. 2024 జనవరి 22 న ఈ ఆలయం అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది. ఈ వేడుకకు పలువురు రాజకీయ, మత పెద్దలతో పాటు సినీ ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే వీరికి ఆహ్వానాలు అందాయి.
అయోధ్యలో రామ మందిర ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మత పెద్దలకు ఆహ్వానాలు పంపినట్లు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు. 2024 జనవరి 22 జరగనున్న ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, చిరంజీవి, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ధనుష్, రిషభ్ శెట్టి, అనుపమ్ ఖేర్, మాధురీ దీక్షిత్లకు ఆహ్వానాలు అందాయి.
సినీ నటులతో పాటు ప్రముఖ దర్శకులు రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ, రోహిత్ శెట్టి, నిర్మాత మహావీర్ జైన్లు ఆహ్వానం అందుకున్నారు. ఈ వేడుకకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను కూడా ట్రస్ట్ ఆహ్వానించింది. మందిర ప్రారంభానికి వారం ముందే అంటే జనవరి 16 నుండి వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. వారణాసికి చెందిన వేద పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22 న రాముని విగ్రహానికి పట్టాభిషేకం చేసి ప్రధాన ఆచారాలను నిర్వహిస్తారు. జనవరి 14 నుండి జనవరి 22 వరకు అయోధ్యలో అమృత్ మహోత్సవం జరగనుంది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రకారం ఈ కార్యక్రమం కోసం 10,000-15,000 మందికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!*
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!









