బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఎంత గెలుచుకున్నాడంటే..!
- December 18, 2023
హైదరాబాద్: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. గత సీజన్ కంటే ఎంతో గ్రాండ్ గా ఈ సీజన్ సాగింది. మొదటి నుండి ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటూ..అలరిస్తూ వచ్చింది. ఈ సీజన్ విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతాడని అంత భావించారు..అదే విధంగా వోటింగ్ వేసి గెలిపించారు. ‘బిగ్ బాస్’ సీజన్ 7లో టాప్ 2 కంటెస్టెంట్స్‌గా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ నిలువగా.. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి వారిని స్టేజ్ మీదకు తీసుకొచ్చి… అనంతరం బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ పేరును ప్రకటించారు. అమర్ దీప్ రన్నరప్‌గా ప్రకటించాడు.
ప్రైజ్ మనీ విషయంలో పల్లవి ప్రశాంత్ కు ఊహించని షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ప్రైజ్ మనీ 50లక్షలు అనౌన్స్ చేసిన బిగ్ బాస్.. అందులోంచి యావర్ 15లక్షలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో టైటిల్ విన్నర్ అయిన ప్రశాంత్ కు 35 లక్షల నగదు బహుమతి లభించింది. నగదు బహుమతితో పాటు, 15 లక్షల జోయాలుక్కాస్ నెక్లెస్ , ఒక బ్రీజా కారు దక్కించుకున్నాడు. తనకు వచ్చిన రూ.35 లక్షల డబ్బును రైతులకు ఇస్తానని వేదిక ఫై ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్నాడు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష