దుబాయ్‌లో మొరాకో కాన్సులేట్ ప్రారంభం
- May 28, 2016
కింగ్డమ్ ఆఫ్ మొరాకో, దుబాయ్‌లో కొత్తగా కాన్సులేట్ జనరల్‌ని ఏర్పాటు చేసింది. యూఏఈలోని మొరాకో కమ్యూనిటీకి చెందిన ప్రముఖులు, అలాగే అధికారుల సమక్షంలో ఈ కాన్సులేట్ జనరల్ ప్రారంభమైంది. 'స్మార్ట్ కాన్సులేట్' అప్లికేషన్ని ఈ సందర్భంగా ప్రారంభించారు. మొబైల్ ఫోన్ల ద్వారా కాన్సులర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులను పొందేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. మొరాకో రాయబారి మొహ్మద్ అయిత్ అలి మాట్లాడుతూ, మొరాకో కాన్సులేట్ జనరల్ హెడ్ క్వార్టర్స్‌ని ప్రారంభించడం చాలా గర్వంగా ఉందన్నారు. మొరాకో కాన్సుల్ జనరల్ మొహ్మద్ అల్ బెర్నౌసి ఈ సందర్భంగా మొరాకో కమ్యూనిటీకి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







