ఆందోళనకారుల దాడిలో పోలీసులకు గాయాలు
- May 28, 2016
ఆందోళనకారులు జరిపిన దాడిలో ఇద్దరు బహ్రెయినీ పోలీసులు గాయపడ్డారని ఇంటీరియర్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. బిలాద్ అల్ కాదిమ్లో ఆందోళనలు జరగ్గా, ఆందోళనకారుల్ని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారనీ, ఈ క్రమంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని ఆ ప్రకటనలో ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. షియాతీ అపోజిషన్ చీఫ్ షేక్ అలి సల్మాన్ సొంత ప్రాంతం బిలాద్ అల్ కాదిమ్. షేక్ అలి సల్మాన్ ఐదేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు, తన విపరీత ప్రవర్తన కారణంగా. బహ్రెయిన్ న్యాయస్థానం గురువారం, 19 షియాతీలకు పోలీసులపై దాడి చేసిన కేసులో శిక్ష విధించింది. వీరిలో ఐదుగురికి యావజ్జీ కారాగార శిక్ష పడింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







