బిగ్ బాస్ అభిమానులకు TSRTC ఎండీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

- December 18, 2023 , by Maagulf
బిగ్ బాస్ అభిమానులకు TSRTC ఎండీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్: బస్సుల పై దాడి చేసిన బిగ్ బాస్ అభిమానులపై టీఎస్ఆర్టీసి ఎండి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు.

ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు.

"ఇదేం అభిమానం!.. బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో నిన్న(ఆదివారం) రాత్రి టీఎస్ఆర్టీసికి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఇక అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ" సజ్జన్నార్ ఎక్స్ వేదికగా తెలిపారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com