సమాజంలో మత్తు పదార్థాలకు స్థానం లేదు: సీపీ సుధీర్ బాబు
- December 18, 2023
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా మరియు వినియోగం మీద ఉక్కు పాదం మోపుతామని కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. ఈరోజు బండ్లగూడలోని జిఎస్ఐ ఆడిటోరియంలో ఎన్డిపిఎస్ కేసుల ప్రొసీజరల్ ఎక్సలెన్స్ సెమినార్ మరియు వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మరియు పై స్థాయి అధికారులకు నిషేధిత డ్రగ్స్ కేసుల విచారణకు ఉపకరించే హ్యాండ్ బుక్ మాన్యువల్ అందించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిది అని, డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా మరియు వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద క్రమం తప్పకుండా చేస్తున్న తనిఖీలతో పాటు, ప్రత్యేక ఎస్ఓటి బృందాలు ఏర్పాటు చేసి చేపడుతున్న ఆపరేషన్ల ద్వారా ఎన్నో గంజాయి, ఓపియం, హెరాయిన్ వంటి ఇతర నిషేధిత డ్రగ్స్ సరఫరా ముఠాలను పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలను అణచివేయాలని, వారి మీద పిడి చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు.
తెలిసీ తెలియక మత్తు పదార్థాల బారిన పడడం వల్ల యువత యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని, యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని కమిషనర్ అన్నారు. నిషేధిత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సూచించారు. మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నొ దాడులు చేస్తున్నామని, ఎంతో మందిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీపీ పేర్కొన్నారు. యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల అవగాహన కల్పించేలా కళాశాలల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ డి.జానకి, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఎస్ఓటి డీసీపీ గిరిధర్, ఎల్బీ నగర్ డీసీపీ సాయి శ్రీ, ఎస్ఓటి డీసీపీ మురళీధర్ మరియు ఇతర ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష