బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్.! విన్నర్ ఉల్టా ఫుల్టా.!
- December 18, 2023
మోస్ట్ పాపులర్ బుల్లితెర గేమ్ షో అయిన బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ తుది అంకం పూర్తయిపోయింది. విజేతగా సామాన్యుడు, రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్‌ని ప్రకటించారు.
ఈ సారి బిగ్‌బాస్ విజేతపై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు. అంచనాల్లేవ్. సీనియర్ నటుడు శివాజీ.. తనదైన ఆటిట్యూడ్, హుందాతనంతో ఈ సారి ఎక్కువ మార్కులు కొట్టేయడంతో ఆయనదే బిగ్‌బాస్ ట్రోఫీ అనుకున్నారు కానీ, దానిపైనా ఏమంత ఇంట్రెస్ట్ పెట్టలేదు.
అయితే, ఉల్టా ఫుల్టా బిగ్‌బాస్‌లో ఏదైనా జరగొచ్చు.. ముఖ్యంగా అనుకున్నది అయితే జరగనే జరగదు.. అనే స్లోగన్‌తో ఈ సారి సీజన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.
అందుకు తగ్గట్లుగానే ఏవేవో మార్పులు జిరిగాయ్ హౌస్‌లో. కొత్త వాళ్లు వచ్చారు. ఆల్రెడీ హౌస్‌లో వుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లినవాళ్లు మళ్లీ వచ్చారు.. ఇలాంటివి చాలానే జరిగాయ్.
మొదట్లో ఒకట్రెండు ఎపిసోడ్లు ఇంట్రెస్టింగ్గా సాగిన బిగ్‌బాస్ షో, ఆ తర్వాత చప్పబడిపోయింది. ఎట్టకేలకు చివరి ఎపిసోడ్ వచ్చేసింది. విజేత ఎవరో తేలిపోయింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ కాగా, రన్నర్‌గా అమరదీప్ నిలిచాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







