శ్రీలీల ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.?
- December 18, 2023
శ్రీలీల ఏం చేయడమేంటీ.? వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతుంటుంది కదా.. అనుకుంటున్నారా.? అవునండీ శ్రీలీల మోస్ట్ బిజీనే హీరోయిన్‌గా. కానీ, శ్రీలీల పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలిసిందే కదా.
ఆమె ఓ వైపు ఎమ్‌బిబియస్ చదువుతూనే, మరోవైపు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్‌గా కొనసాగిస్తూనే మధ్య మధ్యలో గ్యాప్ దొరికినప్పుడల్లా మెడిసెన్‌కి ప్రిపేర్ అవుతూ వచ్చింది శ్రీలీల.
ఇప్పుడు ఎమ్‌బిబిఎస్ ఎగ్జామ్స్ నడుస్తుండడంతో కొన్ని రోజులు షూటింగుల నుంచి గ్యాప్ తీసుకుందట. పూర్తిగా తన ఫోకస్ అంతా పరీక్షల పైనే పెట్టిందట.
ప్రాజెక్టులపై సైన్ చేసేటప్పుడే ఈ డీల్ సెట్ చేసుకుందట శ్రీలీల. గతంలో సాయి పల్లవి కూడా ఇలాగే చేసింది. షూటింగ్ గ్యాప్‌లో పరీక్షలకు ప్రిపేర్ అయ్యేది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని ఎమ్‌బిబియస్ పూర్తి చేసి వచ్చి, మళ్లీ ఇప్పుడే సినిమాల్లో బిజీ అవుతోంది.
శ్రీలీల కూడా అంతే, క్రేజ్ వున్నన్నాళ్లూ సినిమాలు చేస్తాననీ, ఆ తర్వాత చక్కగా తన మెడిసెన్ వృత్తిని కొనసాగించుకుంటానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల చెప్పుకొచ్చింది.
ఇప్పటికే శ్రీలీల నుంచి చాలా సినిమాలొచ్చేశాయ్. కానీ, అవన్నీ చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకోలేదు. కానీ, శ్రీలీల క్రేజ్ మాత్రం తగ్గనే లేదు.
తాజా వార్తలు
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







