విక్రమ్ ‘తంగలాన్’ మూవీకీ తప్పని తిప్పలు.!
- December 18, 2023
సీనియర్ నటుడు విక్రమ్‌కి సినిమా అంటే ఎంత ప్యాషన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా కోసం ప్రాణాలకు తెగించి మరీ సాహసాలు చేసేస్తుంటాడాయన.
అయితే దురదృష్టవశాత్తూ.. అంత కష్టపడి చేసిన కొన్ని సినిమాలు విక్రమ్‌కి ఫెయిల్యూర్స్‌నే మిగిల్చాయనుకోండి. ఇప్పుడు ఆయన చేస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘తంగలాన్’.
ఇందులో విక్రమ్ పాత్ర చాలా చాలా భిన్నంగా వుండబోతోంది. ఆయన పాత్రకు సినిమాలో అస్సలు డైలాగులే వుండవ్. గెటప్ కూడా టార్జాన్ గెటప్‌ని తలపిస్తోంది.
ఇటీవల రిలీజైన ఈ సినిమా పోస్టర్లు సినిమాపై బోలెడంత క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అనుకున్న టైమ్‌కి ఈ సినిమా రిలీజ్ కాకపోవడంపై విక్రమ్ ఫ్యాన్స్ ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆయన నటించిన ‘ధృవ నక్షత్రం’ సినిమా కూడా ఇంతవరకూ రిలీజ్‌కి నోచుకోలేదు. ఈ మధ్య ఇదిగో అదిగో అన్నారు కానీ, అదీ జరగలేదు.
ఇక, ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘తంగలాన్’ సినిమాకీ రిలీజ్ కష్టాలు తప్పడం లేదు. అయితే, ఈ సినిమాకి సీజీ వర్క్ ఇంకా పూర్తి కాని కారణంగానే పోస్ట్ పోన్ అయ్యిందని అంటున్నారు.
అన్నీ బాగుంటే, జనవరి 26న ‘తంగలాన్’ ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. మాళవికా మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







