అయోధ్య రామాలయం థీమ్‌తో డైమెండ్ నక్లెస్..
- December 19, 2023
అయోధ్య: భారత దేశ వ్యాప్తంగా హిందువులు ఎంతో ఆసక్తిగా భక్తిభావంతో ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. శ్రీరామ జన్మభూమి తీరథ్ క్షేత్ర ట్రస్ట్ వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన రామాలయం గర్భగుడి వద్ద రామ లల్లాను ప్రతిష్టించాలని నిర్ణయించారు. ఇదిలాఉంటే.. తాజాగా గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని వజ్రాల వ్యాపారి డైమెండ్ నక్లెస్ ను తయారు చేశారు. అయోధ్య రామాలయం థీమ్ తో తయారు చేసిన ఈ డైమండ్ నక్లెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ డైమెండ్ నక్లెస్ కోసం సుమారు 5వేల అమెరికన్ వజ్రాలను వాడారు. దాదాపు రెండు కేజీల వెండితో ఈ నక్లెస్ ను రూపొందించారు. సూరత్ కు చెందిన రసేష్ జ్యువెలర్స్ ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించింది. 35రోజుల్లో 40 మంది కళాకారులు దీన్ని పూర్తి చేశారు. అయోధ్య రామాలయానికి బహుమతిగా ఈ డైమండ్ నక్లెస్ ను ఇవ్వనున్నట్లు వజ్రాల వ్యాపారి తెలిపారు. ఈ నక్లెస్ లో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుని విగ్రహాలు, రామ్ దర్బార్ తో పాటు జింకలు ఉన్నాయి.
వచ్చే ఏడాది జనవరి 22న భారీ వేడుకల మధ్య భక్తులకోసం రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 6వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. జనవరి 14 నుంచి జనవరి 22 వరకు అయోధ్య అమృత మహోత్సవ్ ను సూచిస్తుంది.
తాజా వార్తలు
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







