యువ శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను అందివ్వాలి: ఇస్రో డైరెక్టర్ శ్రీకాంత్
- December 19, 2023
హైదరాబాద్: మనవ జీవన ప్రయాణం సాంకేతికతతోనే ఆరంభమవుతుందని చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ శ్రీకాంత్ అన్నారు.
చంద్రయాన్-3తో ప్రపంచ దేశాలకు ఇస్రో ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. బిట్స్ పిలానీ క్యాంపస్‌లో సోమవారం సెన్సార్ టెక్నాలజీపై 16వ అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్ మాట్లాడుతూ..యువ శాస్త్రవేత్తలు టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రపంచానికి సాంకేతికతను అందించాలని చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఫైబర్ ఆప్టిక్ గైరోస్కోప్ ఆధారిత సెన్సార్ ఉత్పత్తి విధానాన్ని వివరించారు. సెన్సింగ్ టెక్నాలజీ డొమైన్ పనిచేసే విధానాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిట్స్ పిలానీ వైస్ చాన్సలర్ రాంగోపాల్‌రావు, బిట్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







