‘సలార్’ని బొత్తిగా పట్టించుకోవడం మానేశారేంటీ.!
- December 19, 2023
డిశంబర్ 22న ప్రబాస్ నటించిన ‘సలార్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకుడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘సలార్’ సినిమా రిలీజ్ దగ్గర పడేటప్పటికి చేతులెత్తేశారెందుకో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
అవును నిజమే.! ప్రబాస్ సినిమా అంటే ఎలా వుండాలి.? ఏ రేంజ్ హడావిడి వుండాలి.! అటు ఫ్యాన్స్ కానీ, ఇటు చిత్ర యూనిట్ కానీ ఎంత హంగామా చేయాలి.!
కానీ, అలాంటి వాతావరణమే కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగా టీజర్లు, ట్రైలర్లు వదిలేసి చేతులు దులిపేసుకుంటున్నారంతే.
వార్తల్లోనూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు. అయినా మాట్లాడుకునేందుకు ఏముందంటారా.? అదీ నిజమే.! ప్రోమోస్‌లో ఎక్కడ చూసినా ప్రబాస్ హైలైట్ కావడం లేదు. పృద్ధీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.
ఏ ప్రోమో చూసినా ఆయనే హైలైట్ అవుతున్నాడు తప్ప.. ప్రబాస్ అస్సలు హైలైట్ కావడం లేదు. అన్నింటికీ మించి, సినిమాలో అంతా ‘కేజీఎఫ్’ ఫ్లేవరే కనిపిస్తోంది. అది కూడా ఫ్యాన్స్‌లో ఒకింత ఆందోళన కలిగిస్తూనే, నిరాశకు గురి చేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు







