‘హనుమాన్’ తేజ సజ్జా స్టామినా ఎంతో.!
- December 19, 2023
తేజ సజ్జా హీరోగా ‘హనుమ్యాన్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఎక్కడ ధర్మం వుంటుందో అక్కడ హనుమంతుడుంటాడు.. ఎక్కడ హనుమంతుడుంటాడో అక్కడ విజయం వుంటుంది..’ అనే స్లోగన్‌తో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బుడ్డోడికి ఈ రేంజ్ సినిమా ఎలా పడిందా.? అని కొందరు కుళ్లుకుంటున్నారంటే అతిశయోక్తి కాదేమో.
కథ, కాకరకాయ్ ఎలా వుండబోతోందో ఏమో కానీ, విజువల్ ఎఫెక్ట్స్ అయితే అదిరిపోయాయ్. నిజింగానే ట్రైలర్ కూడా అదిరిపోయింది.
సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీగా ఈ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 12న ధియేటర్లలో హనుమ్యాన్ సందడి చేయబోతోంది. ధియేటర్లు సరిగ్గా దొరికితే, మనోడికి అసలు సిసలు సంక్రాంతి పండగే.
కానీ, ఆ తర్వాత రిలీజ్ కాబోయే పెద్ద సినిమాల దృష్ట్యా ‘హనుమ్యాన్’కి ఎన్ని ధియేటర్లు దక్కుతాయో తెలీదు కానీ, నిలబడగలిగితే మాత్రం వసూళ్ల పండగే. ప్రేక్షకులు ఆదరించదగ్గ కళ కనిపిస్తోంది ‘హనుమ్యాన్’కి. చూడాలి మరి ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్







