104 మంది ఐఎస్ఎస్ సభ్యులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు..
- May 28, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపినట్లు టర్కీ అధికారులు చెబుతున్నారు. టర్కీలోని పలు పట్టణాల్లో శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక, ఇతర దాడుల్లో 104 మంది ఐఎస్ఎస్ సభ్యులను హతమార్చినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాదుల సంఖ్య పై స్పష్టత లేదని పేర్కొన్నారు. మొదటగా టర్కీ స్థానిక మీడియాలో ఈ వార్తలు ప్రసారం అయ్యాయి. దీంతో టర్కీ అధికారులు శుక్రవారం రాత్రి నిర్వహించిన దాడుల ఆపరేషన్ పై స్పందించారు.అమెరికాతో పాటు తమ సేనలు యుద్ధవిమానాల ద్వారా, వైమానిక, భూభాగ విభాగాల సైన్యం బాంబు దాడులు, కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు. ఉగ్రకార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలుగా వినియోగిస్తు ఏడు పెద్ద భవంతులను ధ్వంసం చేశారు. ఇటీవల సిరియా సరిహద్దు ప్రాంతాల్లోనూ 21 మంది చనిపోవడంతో పాటు 12 మందికి పైగా గాయపడ్డారు
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







