భయపెట్టేస్తానంటోన్న తెలుగమ్మాయ్.!

- December 19, 2023 , by Maagulf
భయపెట్టేస్తానంటోన్న తెలుగమ్మాయ్.!

పదహారణాల తెలుగమ్మాయ్ అనన్య నాగళ్ల.. త్వరలో ‘తంత్ర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల నటిగా మంచి పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ తదితర సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించాకా, అనన్య రేంజ్ కాస్త పెరిగిందనే చెప్పొచ్చు.

ఆ తర్వాత సమంతతో ‘శాకుంతలం’ సినిమాలో నటించింది. ఈ సినిమాల్లో అనన్య నిడివి తక్కువ వున్న పాత్రలే అయినా తన వంతు తన పాత్రలన్నింటికీ న్యాయం చేసింది.

నటిగా వెండితెరపై అప్పుడప్పుడూ అయినా వెలుగులు విరజిమ్ముతూనే సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా ఫాలోయింగ్ దక్కించుకుంది.

గ్లామరస్ పోజులతో నెటిజన్లకు బాగా దగ్గరైపోయింది. అవర్ గ్లాస్ ఫిజిక్‌తో అందాల ఆరాధకులకు కిక్కిచ్చే అనన్య నాగళ్ల ఇప్పుడు భయపెట్టేందుకు సిద్ధమైంది.

‘తంత్ర’ అనే హారర్ సినిమాలో అనన్య లీడ్ రోల్ దక్కించుకుంది. లేటెస్ట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్లు. తనదైన నటనతో అనన్య ఈ సినిమాతో ఆకట్టుకోబోతోందని టీజర్ ద్వారా అర్ధమవుతోంది. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com