సిజేరియన్ కంటే, సహజ ప్రసవంలో పుట్టిన బిడ్డలు ఎక్కువ ఆరోగ్యంగా వుంటారా.?

- December 19, 2023 , by Maagulf
సిజేరియన్ కంటే, సహజ ప్రసవంలో పుట్టిన బిడ్డలు ఎక్కువ ఆరోగ్యంగా వుంటారా.?

ఈ రోజుల్లో సహజ ప్రసవాలు చాలా చాలా అరుదుగా చూస్తున్నాం. ఒకప్పుడు సిజేరియన్ అంటేనే తెలీదు. చాలా అరుదైన తప్పని పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ ద్వారా ప్రసవం (డెలివరీ) చేసేవారు. కానీ, ఇప్పుడు ప్రసవ కాలంలో వచ్చే నొప్పులు భరించలేకనో, లేదంటే ఆ టైమ్‌లో వచ్చే నొప్పులకు కడుపులోని బిడ్డ ప్రెజర్ ఫీలవుతుందన్న కారణం కావచ్చు.. అనేక రకాల కారణాలు నేచురల్ డెలివరీని పక్కన పెట్టేసి, సిజేరియన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే, పుట్టిన బిడ్డ మంచి ఘడియల్లో పుట్టాలన్న మూఢ నమ్మకాలు కూడా సిజేరియన్ వైపు ఎక్కువ వెళ్లేలా చేస్తున్నాయ్.

అయితే, సిజేరియన్ ద్వారా పుట్టిన పిల్లల కన్నా, సహజ ప్రసవం ద్వారా పుట్టిన పిల్లలు ఎక్కువ ఆరోగ్యంగా వుంటారని గైనకాలజిస్టులు చెబుతున్నారు.

నార్మల్ డెలివరీ పిల్లల్లో ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ వుంటుంది. నార్మల్ డెలివరీలో బిడ్డ జననేంద్రియ మార్గం ద్వారా బయటకు రావడమే అందుకు కారణం. జననేంద్రియాల్లో కొన్ని మంచి బాక్టీరియాలుంటాయ్. అవి డెలివరీ టైమ్‌లో బిడ్డ శరీరంలోకి చేరడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

అంతేకాదు, నార్మల్ డెలివరీ పిల్లల్లో ఊపిరితిత్తుల సమస్యలు కూడా తక్కువగా వుంటాయ్. అందుకు కారణం, నార్మల్ డెలివరీలో ఇంచుమించుగా 18 గంటల నుంచి, 24 గంటల వరకూ నొప్పులు భరించాల్సి వుంటుంది.

ఈ టైమ్‌లో లోపల ఒత్తిడిని తట్టుకునే శక్తిని బిడ్డ కలిగి వుంటుంది.  అలాగే, జననేంద్రియ మార్గం ద్వారా బిడ్డ బయటికి రావడం వల్ల ఊపిరితిత్తులు కుదించబడి, కడుపు లోపల ఏవైనా నీరు తాగడం వంటివి జరిగితే, ఆ నీరు బయటికి వచ్చేస్తుంది.

తద్వారా బిడ్డ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా వుంటాయ్. అందుకే జలుబు, దగ్గులు, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు సహజ ప్రసవం ద్వారా పుట్టిన బిడ్డల్లో తక్కువగా వుంటాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com