నిహారిక ‘వాట్ ద ఫిష్’ కథేంటీ.!
- December 19, 2023
మెగా డాటర్ నిహారిక మళ్లీ వస్తోంది. హీరోయిన్‌గా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి మొదట సంచలనమే సృష్టించింది నిహారిక. అయితే, సరైన సక్సెస్ అందక రేస్‌లో వెనకే వుండిపోయింది.
డిఫరెంట్ జోనర్ మూవీస్ ట్రై చేసింది కానీ, వర్కవుట్ కాలేదు. దాంతో, తాత్కాలికంగా సినిమాలకు బ్రేకిచ్చి, నిర్మాణంలో సత్తా చాటింది.
ఇటీవలే ఓ వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ ముఖానికి రంగేసుకున్న నిహారిక, మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘వాట్ ద ఫిష్’ అనే సినిమాతో నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతోంది. మంచు మనోజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
అయితే, ఈ ఇద్దరూ జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారా.? లేక ఎవరి పాత్రలు వారివే ఇంపార్టెన్స్ సంతరించుకోదగ్గవా.? అనేది తెలియాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాల్సి వుంటుంది.
వెరీ లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి నిహారిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రావిషింగ్ అండ్ స్టైలిష్ లుక్స్‌లో నిహారిక కూసింత గ్లామరస్‌గానూ కనిపిస్తోంది ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో. చూడాలి మరి, నిహారికకు ఈ సెకండ్ ఇన్నింగ్స్ అయినా వర్కవుట్ అవుతుందో లేదో.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







