మరో విదేశీ ఎయిర్‌లైన్స్‌ భారత్‌కు

- May 28, 2016 , by Maagulf
మరో విదేశీ ఎయిర్‌లైన్స్‌ భారత్‌కు

 సింగపూర్‌కు చెందిన బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ స్కూట్‌ భారత్‌లో తమ సేవలను ప్రారంభించింది. సింగపూర్‌ నుంచి చెన్నై, అమృత్‌సర్‌లకు రెండు విమానసర్వీసులను నేటి నుంచి మొదలుపెట్టింది. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి జైపూర్‌కు కూడా తమ సేవలను విస్తరించనున్నట్లు స్కూట్‌ ప్రకటించింది.
ఇందులో భాగంగా చెన్నైకు ప్రతిరోజూ 335 సీట్ల కెపాసిటీ కలిగిన బోయింగ్‌ విమాన సర్వీసును నడపనుంది. సింగపూర్‌- అమృతసర్‌ మధ్య 375 సీట్ల కెపాసిటీ కల్గిన బీ787-900 విమానం వారానికి మూడు సార్లు నడవనుంది. జులై 2 నుంచి అమృతసర్‌కు వారానికి నాలుగుసార్లు విమానసర్వీసులను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్కూట్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com