పార్లమెంట్ ఘటన..ఉపరాష్ట్రపతి జగదీప్‌కు ప్రధాని మోడీ ఫోన్
- December 20, 2023
న్యూఢిల్లీ: మాక్ పార్లమెంట్ నిర్వహించి రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ పై మిమిక్రీ చేసిన విపక్ష సభ్యుల ప్రవర్తనను ప్రధాని మోడీ ఖండించారు. మాక్ పార్లమెంట్ ఘటన దురదృష్టకరమని ప్రధాని అన్నారు. ఆ ఘటన పట్ల బాధను వ్యక్తం చేసిన ప్రధాని.. రాజ్యసభ చైర్మెన్ జగదీప్‌కు ఫోన్ చేసి తన విచారాన్ని తెలిపారు. మంగళవారం సస్పెండ్ అయిన పార్లమెంట్ విపక్ష సభ్యులు.. మకర ద్వారం వద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మెన్ జగదీప్‌ను వెక్కిరిస్తూ నాటకం వేసిన విషయం తెలిసిందే. టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ.. చైర్మెన్ జగదీప్ తరహాలో నటిస్తూ ఆయన్ను అవమానించారు.
ఈ నేపథ్యంలో జగదీప్‌కు మోడీ ఫోన్ చేశారు. 20 ఏళ్లుగా ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నానని, ఇంకా అలాంటి అవమానాలు ఎదురవుతున్నాయని, రాజ్యాంగబద్దమైన స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తులకు, అది కూడా పార్లమెంట్లో అవమానం జరగడం దురదృష్టకరమని ప్రధాని మోడీ అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఫోన్లో వెల్లడించినట్లు ధన్కర్ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా తాను మాత్రం కట్టుబడి పని చేస్తానని, తన మార్గాన్ని ఎవరూ మార్చబోరు అని ప్రధానికి ఫోన్లో చెప్పిటన్లు చైర్మెన్ ధన్కర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష