దుబాయ్ లో ఘనంగా ప్రవాస తెలుగు వారి 'క్రూజ్ క్రిస్మస్' వేడుకలు

- December 20, 2023 , by Maagulf
దుబాయ్ లో ఘనంగా ప్రవాస తెలుగు వారి \'క్రూజ్ క్రిస్మస్\' వేడుకలు

దుబాయ్: దుబాయ్ లో ఉన్న క్రైస్తవ సంఘాల కలయికతో బ్రదర్ సామ్యూల్ రత్నం నీలా
ఆధ్వర్యంలో ఘనంగా దెయిరా క్రీక్  Dhow Cruise నందు అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా క్రైస్తవులు మరియు ఇతర మతస్థులు అందరూ  రెండు వందల కుటుంబాలు,వారి పిల్లలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. ఇందులో భాగంగా క్రైస్తవ సంఘాల క్వయర్ తో కలిసి అందరూ పాటలతో , ప్రార్థనలతో అలరించారు. బ్రదర్ అరవింద్ వుడ్స్-సాక్సోఫోన్, యేసు,మేరి జ్యోతి బృందం వారు క్రిస్మస్ కేరల్స్ తో గాత్ర కచేరితో అలరించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ లో వివిధ సంఘాల పాస్టర్స్ మరియు సంఘ పెద్దలలో పాటు సామాజిక కార్యకర్తలు శ్రీకాంత్ చిత్తర్వు(మా గల్ఫ్ న్యూస్ అధినేత), పాస్టర్.జాన్ ప్రసాద్, పాస్టర్.జైకుమార్ రబ్బి, ఇమ్మాన్యేల్ నీలా,జూలియాన హుర్గోయి, పాస్టర్.సంపదరావు, పాస్టర్.రత్నరాజు, పాస్టర్.సాల్మన్ రాజు, జోయల్ మీడియా టీమ్ ,బ్రదర్.సతీష్ ఏలేటి తదితరులు పాల్గొన్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com