విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో మోసాలు
- December 21, 2023
హైదరాబాద్: విదేశీ కరెన్సీని మార్పిడి చేస్తామని మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాలోని ఏడుగురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుల నుంచి రూ.7,47,000ల విలువగల విదేశీ దిర్హామ్ తో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం డీసీపీ శ్రీబాలా తెలిపిన వివరాల మేరకు ఢిల్లీకి చెందిన మహ్మద్ ఇమ్రాన్ షేక్, వాహీద్ షేక్, కుల్సుం, నిషా, బీహార్‌కు చెందిన ఎం.అలీ షేక్, హసీమ్ ఆలామ్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన షేక్ నిసార్ హైమద్‌లు ఒక ముఠాగా ఏర్పాడ్డారు. నగరంలో అమాయకులతోపాటు చిన్న వ్యాపారులను టార్గెట్ చేస్తున్న ఈ ముఠా తక్కువ శాతం కమీషన్లతో విదేశీకరెన్సీ 'దిర్హామ్'ను మార్పిడి చేస్తామని నమ్మిస్తున్నారు. వారి నుంచి ఇండియన్ కరెన్సీ తీసుకుంటున్న ఈ ముఠా రద్దీప్రాంతాల్లోకి వారిని రప్పిస్తున్నారు. ఆ తర్వాత హడావుడిగా ఓ కవర్లో ఉంచిన 'దిర్హామ్'ను వారికి ఇచ్చేసి అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు. అయితే బాధతులు ఆ తర్వాత కవర్ తీసిచూడగా అందులో పైన, కింద దిర్హామ్ ను పెట్టి మధ్యలో తెల్లకాగితాలు దర్శనమిస్తున్నాయి. ఈ ముఠా చేతిలో మోసపోయిన కొందరు బాధితులు టాస్క్ఫోర్సు పోలీసులను ఆశ్రయిండంతో సీఐ ఎల్.భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. బోయిన పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నిందితులున్నట్టు సమాచారం అందుకుని వారిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కోసం నిందితులను బోయిన పల్లి పోలీస్ స్టేషనల్లో అప్పగించారు.ఎప్పుడైనా ఎక్స్చేంజి లోకి వెళ్లి కరెన్సీ మార్చుకుంటేనే మేలు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష