ఖతార్ హయ్యా వీసా చెల్లుబాటు గడువు పొడిగింపు
- December 21, 2023
దోహా: హయా వీసా చెల్లుబాటు గడువును ఫిబ్రవరి 24, 2024 వరకు పొడిగిస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఖతార్ రాష్ట్రం నిర్వహించే అతిపెద్ద క్రీడా కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలకు హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుండి అభిమానులు, సందర్శకుల రాకను సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో పేర్కొంది., అంతర్గత మంత్రిత్వ శాఖ, హయ్యా ప్లాట్‌ఫారమ్‌తో భాగస్వామ్యంతో FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 అభిమానుల కోసం హయ్యా వీసా కార్డును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వీసా హోల్డర్ల కోసం చివరి ప్రవేశం ఫిబ్రవరి 10 న ఉంటుందని, ఇది వారికి ఖతార్‌ను సందర్శించడానికి మరియు AFC ఆసియా కప్ ఖతార్, ఈ కాలంలో దేశం నిర్వహించే ఇతర ఈవెంట్లను ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుందని తెలిపింది. మరింత సమాచారం కోసం హయ్యా ప్లాట్‌ఫారమ్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష