యూఏఈలో కొత్త మానసిక ఆరోగ్య చట్టం..ఉల్లంఘిస్తే dh200,000 వరకు జరిమానా, జైలుశిక్ష

- December 21, 2023 , by Maagulf
యూఏఈలో కొత్త మానసిక ఆరోగ్య చట్టం..ఉల్లంఘిస్తే dh200,000 వరకు జరిమానా, జైలుశిక్ష

యూఏఈ: యూఏఈ ప్రభుత్వం బుధవారం నాడు మానసిక ఆరోగ్యంపై ఫెడరల్ చట్టాన్ని జారీ చేసింది. దాని నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలుశిక్ష,  Dh 50,000 నుంచి Dh200,000 వరకు జరిమానా విధించనున్నారు. కొత్త చట్టం మానసిక ఆరోగ్య సంరక్షణ ల్యాండ్‌స్కేప్‌లో తాజా ప్రాక్టిస్, పురోగతికి అనుగుణంగా ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.  మానసిక రోగులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణను అందించడం ఈ చట్టం లక్ష్యంగా ఉందన్నారు. దీంతోపాటు కొత్త చట్టం మానసిక రోగి హక్కులు, గౌరవాన్ని పరిరక్షించడం, వారి సామాజిక ఏకీకరణను ప్రోత్సహించడంతో పాటు వారిపై, వారి కుటుంబాలు మరియు సమాజంపై మానసిక పరిస్థితుల ప్రతికూల ప్రభావాలను గణనీయంగా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కొత్త చట్టం చట్టంలోని నిబంధనల ప్రకారం.. అధికారికంగా అనుమతిని పొందకుండా మానసిక ఆరోగ్య సేవలను అందించడాన్ని నిషేధిస్తుంది.  కొత్త ఫెడరల్ డిక్రీ ప్రకారం, మైనర్ సైకియాట్రిక్ రోగులు వారి వయస్సు,  మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక ఆరోగ్య హామీల నుండి ప్రయోజనం పొందుతారు. ఇందులో విద్యాహక్కును కూడా పొందుపరిచారు.  ప్రతి ఎమిరేట్‌లోని రోగుల హక్కుల కమిటీ నివేదికలను సమీక్షిస్తుంది. ఫిర్యాదులు, అభ్యంతరాలను ఇది పరిష్కరిస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com