దుబాయ్ లో డెలివరీ రైడర్లందకీ త్వరలో ఎలక్ట్రిక్ బైక్‌లు

- December 22, 2023 , by Maagulf
దుబాయ్ లో డెలివరీ రైడర్లందకీ త్వరలో ఎలక్ట్రిక్ బైక్‌లు

దుబాయ్: ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్‌లకు మారడానికి డెలివరీ కంపెనీల కోసం ప్రోటోటైప్ ఇ-బైక్‌ను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) గురువారం ప్రవేశపెట్టింది. దీంతో భవిష్యత్ వాణిజ్య రవాణా సేవల పరిధిని విస్తరించడం, మెరుగుపరచడం, సున్నా-ఉద్గార రవాణా మార్గాల వైపు మార్పును వేగవంతం చేయడం అని ఆర్టీఏ లైసెన్సింగ్ ఏజెన్సీలో వాణిజ్య రవాణా కార్యకలాపాల డైరెక్టర్ ముహన్నద్ ఖలీద్ అల్ ముహైరి తెలిపారు. డెలివరీ రైడర్లకు తగిన ప్రోటోటైప్ ఇ-బైక్ మోడల్‌ను అభివృద్ధి చేయడానికి పరిశ్రమ నిపుణులతో ఆర్టీఏ సహకరించిందని అల్ ముహైరి చెప్పారు. ఈ-బైక్‌ల కోసం దుబాయ్ అంతటా ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందన్నారు. ఇ-బైక్‌లకు మారడం శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తుందని  అల్ ముహైరి వివరించారు. కర్బన ఉద్గారాలను 30 శాతం తగ్గించేందుకు దుబాయ్ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా ఆర్టీఏ ప్రయత్నిస్తోందని అల్ ముహైరి చెప్పారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com