దుబాయ్ లో ఘనంగా ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
- December 22, 2023
దుబాయ్: దుబాయ్ లో YSRCP NRI కమిటీ అడ్వైజర్ ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్ఆర్సిపి యువ నాయకులు మహమ్మద్ జిలాన్ భాష,తరపట్ల మోహన్ ,రెడ్డయ్య రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, సయ్యద్ నాసర్, చిల్లే తాతాజీ , పాస్టర్ యోహన,మరియు YSRCP కార్యకర్తల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భారత దేశం వెలుపల అత్యంత ఎక్కువ అభిమానులు పాల్గొన్న వేడుకగా దుబాయ్ లో నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే, దుబాయ్ లో నివసిస్తున్న YSRCP కార్యకర్తలు మరియు జగనన్న అభిమానులు బర్ దుబాయ్ ప్రాంతంలోని హోటల్ నిహాల్ లో జగనన్న పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 600 మంది కార్యకర్తలు మరియు జగనన్న అభిమానులు పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
జగనన్న జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసిన అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు, విచ్చేసిన మహిళలకు కార్యక్రమంలో భాగంగా నాలుగు వందలకు పైగా చీరల పంపిణీ, మహమ్మద్ జిలాన్ భాష మరియు పవన్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 150 ప్రవాసఆంధ్రులకు APNRTS బీమా పథకంకు ఆర్థిక సహాయం చేశారు.
దాదాపు 100 మందికి పైగా కొత్తవారిని YSRCP పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత ప్రసన్న సోమిరెడ్డి మరియు మహమ్మద్ జిలాన్ భాష ,మోహన్ తరపట్ల ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాలనలో జరిగిన అభివృద్ధిని మరియు సంక్షేమ కార్యక్రామాలని వివరిస్తూ మళ్లీ వచ్చే 2024 ఎలక్షన్లలో పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎటువంటి విభేదాలు లేకుండా, ఒకరినొకరు కలుపుకొని, ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా శక్తీ వంచన లేకుండా కృషి చేసి మళ్లీ వైఎస్ఆర్సిపి పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకుని మన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని స్థాపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని విచ్చేసి, విజయవంతం చేసిన కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.కార్యక్రమంలో నాసర్ సయ్యద్,బ్రహ్మానంద రెడ్డి, ఓగూరి శ్రీనివాస్ ,పాస్టర్ అనిల్,కొల్లే రవికుమార్, కటికితల ప్రకాష్, పాలపర్తి నీలిమ, గోసంగి లక్ష్మి, విజయ, మేడిది శ్యామ్, కళ్యాణ్,శ్యామ్ సురేంద్ర రెడ్డి,వెంకట రమణా రెడ్డి,సయ్యద్ సలీమ్,షేక్ షోయబ్,వెంకటప్ప రెడ్డి,RTA జహీర్,గూడూరు విజయ్ రెడ్డి,మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.




తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







