వైకుంఠ ఏకాదశి.. పూర్తైన సర్వదర్శనం టోకెన్ల జారీ
- December 22, 2023
తిరుమల: తిరుమలలో వైకుంఠ ఏకాదశి భక్తుల రద్దీ పెరిగింది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రేపటి నుంచి జనవరి 1వరకు దాదాపు పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం జరుగనుంది. ఇందుకోసం రూ.300 దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విక్రయించింది. ఇప్పటివరకు 2 లక్షల 25 వేల టికెట్లను విక్రయించింది.
ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది. ఇందుకు కోసం తిరుమల, తిరుపతిలో దాదాపు పది కేంద్రాల్లో 94 కౌంటర్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 4 లక్షల 23 వేల 500 టోకెన్లు జారీ చేయనుంది. ఇక స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ లో ఒక టోకెన్ కేంద్రం ఏర్పాటు చేసింది. సర్వదర్శనం టోకెన్లు అర్ధరాత్రి నుంచి టీటీడీ జారీ చేస్తోంది. దీంతో భక్తులు భారీగా తరలివచ్చారు.
ఏకాదశి, ద్వాదశి టోకెన్లు జారీ పూర్తైంది. వైకుంఠ ఏకాదశి దర్శనం, ద్వాదశి దర్శనం టోకెన్ల జారీని టీటీడీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభించింది. నిర్ణీత సమయాని కన్నా ముందుగా టోకెన్లు జారీ చేయడంతో భక్తులకు ఊరట లభించింది. అన్ని కేంద్రాల్లో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ పూర్తైంది. డిసెంబర్ 23, 24వ తేదీ టోకెన్లు జారీ పూర్తి అయింది. ప్రస్తుతం 25వ తేదీకి సంబంధించిన టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది.
సర్వదర్శనం టోకెన్ల కోసం నిన్నటి నుండే కేంద్రాల వద్ద భక్తులు నిరీక్షించారు. టోకెన్ల కోసం నిన్నటి నుండే కేంద్రాల వద్ద భక్తులు తిరుమల కొండపై భక్తులు క్యూ కట్టారు. గంటల తరబడి టోకెన్ల కోసం క్యూలైన్ లో నిరీక్షించారు. ఇక రేపటి నుంచి పది రోజులపాటు దర్శనం టోకెన్లు ఉన్న వారిని మాత్రమే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్‌లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









