పని ఒత్తిడిని తట్టుకోవాలంటే ఈ చిన్న చిట్కాలు పాఠించండి.!
- December 27, 2023దైనందిన జీవితంలో ఒత్తిడి పెద్ద మహమ్మారిగా సంక్రమించింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ పని పని పని.. ఏదో ఒక పని. అది ఉద్యోగం కావచ్చు. మరేదైనా చేతి వృత్తి కావచ్చు.
కొందరు దొరికిన విరామాన్ని ఏదో ఒక రకంగా రీఫ్రెష్‌మెంట్ కోసం వినియోగించుకుంటుంటారు. కానీ, కొందరయితే, అస్సలు విరామం లేకుండా పని చేస్తుంటారు.
తద్వారా ఆయా వ్యక్తుల్లో విపరీతమైన అలసట, అసహనం, కోపం తదితర చికాకులు వేధిస్తుంటాయ్. పని ఒత్తిడి వల్ల కలిగే ఈ చిన్న చిన్న చికాకులు ఒక్కోసారి తీవ్రంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు.
అలాంటి వ్యక్తుల కోసమే ఈ చిన్న చిట్కాలు.
ఎంత పనిలో వున్నప్పటికీ ఆరోగ్యం తప్పని సరి. ఒత్తిడిని తట్టుకోవడానికి అప్పుడప్పుడూ వ్యాయామం చేయాలి. ప్రతీ రోజూ చేస్తే ఇంకా మంచిది.
టైమ్ లేదు అనేది ఓ సాకు మాత్రమే. పని కోసం టైమ్ ఎలా కేటాయిస్తున్నామో, అలాగే, ఆరోగ్యం నిమిత్తం తన శరీరం పైనా దృష్టి పెట్టాలి.
అలాగే, పని చేసే క్రమంలోనే దొరికిన చిన్న చిన్న విరామాల్ని సహోద్యోగులతో మాట్లాడేందుకు వినియోగించాలి. తద్వారా రీఫ్రెష్‌మెంట్ దొరుకుతుంది.
అలాగే, ఇంటి వద్దనే పని చేసే వుద్యోగులైతే, చిన్న పాటి విరామాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ టైమ్‌లో ఇంట సభ్యులతో పిచ్చా పాటీ ముచ్చటించుకోవాలి.
ఏధైనా లైట్‌గా వుండే స్నాక్స్ తీసుకోవాలి. అలాగే, ఇంటి చుట్టూ వుండే చిన్నపాటి గార్డెన్ లేదా పూల కుండీలతో టైమ్ స్పెండ్ చేయాలి. తద్వారా ఒత్తిడి నుంచి రిలీఫ్ దొరుకుతుంది. మెదడుకు స్వాంతన అదుతుంది.
తాజా వార్తలు
- అల్ బురైమిలో డ్రగ్స్.. ప్రవాసుడు అరెస్టు..!!
- నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ప్రారంభించిన కింగ్ సల్మాన్..!
- యూఏఈ నివాసితులు జీవితాన్ని మార్చేసిన వీసా క్షమాభిక్ష..!!
- చెల్లింపు లింక్ల కోసం కొత్త స్క్రీన్.. కువైట్ సెంట్రల్ బ్యాంక్..!!
- హమద్ పోర్ట్లో 1,700 కిలోల నిషేధిత పదార్థం సీజ్..!!
- బహ్రెయిన్ లో మరో 15 ట్రాఫిక్ సర్వీసులు డిజిటైజ్..!!
- లడ్డు బాధ్యుల పై చర్యలు: డిప్యూటీ సీఎం పవన్
- తిరుమల లడ్డూ వివాదం..హైకోర్టులో వైసీపీ పిటిషన్
- ఏపీ: నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్
- అల్ మక్తూమ్ బ్రిడ్జి.. జనవరి 16 వరకు తాత్కాలికంగా మూసివేత..!!