మాస్ రాజాతో అనుపమ స్సైసీ స్సైసీ.!

- December 27, 2023 , by Maagulf
మాస్ రాజాతో అనుపమ స్సైసీ స్సైసీ.!

ఈ మధ్య మాస్ రాజా రవితేజ తన కంటే వయసులో చాలా చిన్నిగా వున్న హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ రెచ్చిపోతున్నారు. తద్వారా కొంత ట్రోల్స్‌కి కూడా గురవుతున్నారు.

కానీ, మాస్ రాజాలో ఏమాత్రం మార్పు లేదు. మళ్లీ మళ్లీ పడుచు హీరోయిన్లనే ఎంచుకుంటున్నారు. ఆయన తాజా చిత్రం ‘ఈగల్’ లోనూ ఇద్దరు ముద్దుగుమ్మలున్నారు.

అందులో ఒకరు అనుపమ పరమేశ్వరన్ కాగా, మరో ముద్దుగుమ్మ కావ్య థాపర్. ‘ఒక చిన్న ప్రేమకథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కావ్య థాపర్‌కి మాస్ రాజా వంటి స్టార్ హీరో పక్కన నటించడం బంపర్ ఆఫరే అయినప్పటికీ రవితేజ సరసన వయసు తారతమ్యం కూసింత ఎక్కువే కదా.. అని నెటిజన్లు వాపోతున్నారు.

కావ్య థాపర్ సంగతి అటుంచితే, అనుపమ పరమేశ్వరన్ అంటే పదహారణాల చక్కని సాంప్రదాయం గుర్తుకొస్తుంది. అఫ్‌కోర్స్ ఈ మధ్య కాస్త డోస్ పెంచిందనుకోండి.

‘టిల్లు స్క్వేర్’ సినిమా కోసం గ్లామర్ బాగా పెంచేసింది. అలాగే, ‘ఈగల్’ లోనూ మాస్ రాజాతో ఆన్ స్ర్కీన్ కెమిస్ర్టీ తెగ పండించేసిందని అంటున్నారు. లిప్‌లాక్స్ కూడా లాగించేసిందని ప్రచారం జరుగుతోంది.

ఈ మధ్య రవితేజ సినిమాల్లో లిప్‌లాక్స్ లేకుండా పని జరగడం లేదు. సో, అలా ఈ సినిమాలో ఇద్దరు భామలతోనూ రవితేజ అంతకు మించి అనేలా రొమాన్స్ చేశారనీ ప్రచారం జరుగుతోంది.

నిజమో కాదో తెలియాలంటే, ఈ సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com