ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కొలకలూరి మధుజ్యోతి నియామకం
- December 27, 2023
అమరావతి: కుప్పం, ద్రవిడ యూనివర్సిటీ ఉప కులపతిగా ఆచార్య డాక్టర్ కొలకలూరి మధుజ్యోతిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్, విశ్వ విద్యాలయాల కులపతి ఎస్. అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ మధుజ్యోతి తెలుగు విభాగంలో శాఖాధిపతిగా విధులు నిర్వహిస్తున్నారు. పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ కుమార్తె మధుజ్యోతి. తండ్రి కూతుర్లు ఉప కులపతులుగా సేవలందించే అదృష్టం కొలకలూరి కుటుంబానికి దక్కింది. ఇదొక చరిత్ర. ఇదొక రికార్డు గా చెప్పుకోవచ్చు.
అనంతపురంకు చెందిన ఆచార్య మధుజ్యోతి శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ఎంఎ గోల్డ్ మెడలిస్ట్. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్ డి చేశారు. అనువాదంలో, తమిళ్ లో పిజీ డిప్లొమాలు చేశారు. హిందీ భాషతో పాటు సంస్కృతంలోనూ ప్రావీణ్యత సంపాదించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 160 పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. బెజవాడ గోపాలరెడ్డి కవిత్వం - సౌందర్యం, తెలుగు సాహితీ వస్తు పరిణామం, సాహిత్య వీక్షణం, దండోరా - అంబేద్కర్ అభీష్టం, శ్రీ తాళ్లపాక సాహిత్యానుశీలం, ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యంపై విమర్శనం, దళిత సంస్కృతి, దళిత సాహిత్య సౌందర్య తత్వం, సంకల్పం సంఘర్షణ జయకేతనం, గుర్రం జాషువా ఇలా 20 పుస్తకాలు రచించి ప్రచురించారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!