విశాఖకు కార్యలయాల తరలింపు..ప్రభుత్వ లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ
- December 28, 2023
అమరావతి: విశాఖపట్నంకు కార్యాలయాల తరలింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారంటూ రాజధాని ప్రాంత రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులను వెలువరించేంత వరకు చర్యలు తీసుకోబోమని ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







