ప్రపంచ స్థాయిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది: చంద్రబాబు
- December 28, 2023
బెంగళూరు: రైతు బిడ్డలు, కార్మికుల బిడ్డలు ఐటీ రంగంలోకి రావాలని ఆరోజు తాను ఆంకాంక్షించానని, అందుకే ఐటీకి పెద్ద పీట వేశానని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగు వారు ఉంటున్నారని చెప్పారు. ఆరోజు తాను టెక్నాలజీ గురించి మాట్లాడితే నవ్వారని… కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపద పెరగడానికి దోహదపడుతోందని తెలిపారు. తన తాజా నినాదం థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అని చెప్పారు. ప్రపంచ స్థాయిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెంగళూరులో తెలుగుదేశం పార్టీ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… తాను ఆరోజు విజన్ 2020 గురించి మాట్లాడితే చాలా మంది నవ్వారని… ఆరోజు తన మాట విన్నవారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. అమ్మాయిలు చదువుకోవాలంటూ తాను ప్రోత్సాహించానని… ఇప్పుడు భర్తల కంటే భార్యలు ఎక్కువ సంపాదించే అవకాశం ఉందని తెలిపారు. అందరూ తనను ఆదరించారని, అభిమానించారని, తాను చెప్పింది విన్నారని అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే మనందరి లక్ష్యమని అన్నారు.
ప్రతి ఒక్కరూ నెట్ వర్క్ ను పెంచుకోవాలని… ప్రతిరోజు 20 మందికి ఫోన్లు చేసి మాట్లాడాలని.. ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పాలని, వచ్చే ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు సలహాలను ఇవ్వాలని చెప్పారు. అందరం కలిసి ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేదే తన జీవిత ఆశయమని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని అన్నారు.
తాజా వార్తలు
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







