ఖతార్‌లో మరణ శిక్ష పడిన 8 మంది భారతీయులకు బిగ్ రిలీఫ్
- December 28, 2023
దోహా: ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది భారతీయులకు పెద్ద ఊరట లభించింది. భారత ప్రభుత్వం అప్పీల్‌పై మొత్తం ఎనిమిది మంది మాజీ భారతీయ నావికులకు డిసెంబర్ 28న మరణశిక్షపై స్టే విధించారు. ఈ విషయమై ఖతార్‌లోని కోర్టును ఆశ్రయించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టు శిక్షను తగ్గించింది.
దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ సవివరమైన నిర్ణయం కాపీ కోసం వేచి చూస్తున్నామని తెలిపింది. తదుపరి చర్యలకు సంబంధించి ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలతో న్యాయ బృందం సంప్రదింపులు జరుపుతోంది. విచారణ సందర్భంగా రాయబారులు, అధికారులు కోర్టుకు హాజరయ్యారు. మొదటి నుండి ఎనిమిది మంది కుటుంబానికి అండగా నిలుస్తున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







