ప్రధానమంత్రి యోజన ఉజ్వల్‌ పథకాన్ని ప్రారంభించిన మోడీ

- May 29, 2016 , by Maagulf
ప్రధానమంత్రి యోజన ఉజ్వల్‌ పథకాన్ని ప్రారంభించిన మోడీ

కర్నాటకలోని దేవనగిరిలో ఏర్పాటు చేసిన ఉజ్వల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొని పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పునరుద్ఘాటించారు. బీమా పథకాలతో దేశంలో నిరుపేదలకు జీవన భద్రత కల్పించామని, దేశంలోని మారుమూల ప్రాంతాలకూ బీమా పథకాలు చేరాయని వెల్లడించారు. జన్‌ధన్‌ యోజన ద్వారా పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.37వేలకోట్లు జమయ్యాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com