అక్కడ షేవింగ్‌లు, ట్రిమ్మింగ్లే కాదు ఏమి చేసినా ఫైనే
- May 29, 2016
అక్కడ గడ్డం గీసుకున్నారా.. ఫైన్ కట్టాల్సిందే.. లేదు ట్రిమ్ చేసుకున్నారా.. అయినా జరిమానా తప్పదు. సిగరెట్ ప్యాకెట్ ఉన్నా.. బిగుతు దుస్తులు ధరించినా.. ఒకటని కాదు, అన్నింటికీ ఫైన్ కట్టాల్సిందే. ఇవి కిరాతక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ నూతన నిబంధనలు.
ఖలీఫా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రపంచ దేశాలను తమ దుశ్చర్యలతో గజగజలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ.. గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. దీంతో తమను తాము బలపరుచుకునేందుకు ఐఎస్ ఆధీనంలో ఉన్న ప్రజలపై విధిస్తున్న పన్నులను అమాంతం పెంచేశారట. అంతేగాక.. కొత్త జరిమానాలను విధించడం మొదలుపెట్టారు. స్థానిక వార్తానివేదికల ఆధారంగా ఐహెచ్ఎస్ ఇన్కార్పొరేషన్ ఇటీవల విడుదల చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
గత ఆరునెలలుగా ఐఎస్ఐఎస్ విధించిన నూతన జరిమానాల వివరాలను ఈ నివేదికలో పేర్కొన్నారు. వీటితో ఇస్లామిక్ స్టేట్ నెలవారీ ఆదాయం 50శాతం వరకు పెరిగే అవకాశముందట. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే.. కొన్ని సందర్భాల్లో ఐఎస్ఐఎస్ విధించే తీవ్రమైన శిక్షలకు బదులుగా డబ్బును అడుగుతోందట.
ఇస్లామిక్ స్టేట్ విధించిన నూతన నిబంధనలు ఇలా ఉన్నాయి..
* గడ్డం గీసుకుంటే 100 డాలర్లు, ట్రిమ్ చేసుకుంటే 50 డాలర్లు
* పురుషులు సంప్రదాయ దుస్తులు వేసుకోకుంటే 5 డాలర్లు
* మహిళలు బిగుతు బురఖాలు వేసుకుంటే 25డాలర్లు
* కళ్లు కన్పించేలా దుస్తులు వేసుకుంటే 10 డాలర్లు లేదా 1 గ్రాము బంగారం
* పురుషుల దగ్గర సిగరెట్ ప్యాకెట్ ఉంటే 46 డాలర్లు, మహిళ వద్ద ఉంటే 23 డాలర్లు
* చెక్పాయింట్లను దాటి ట్రక్కులు వస్తే.. 600 నుంచి 700 డాలర్ల జరిమానా విధిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







