'ఆపరేషన్ వీల్‌హౌస్'లో పట్టుబడ్డ 234 కిలోల డ్రగ్స్
- December 29, 2023
దుబాయ్: ఓడలో 234.68 కిలోల మాదకద్రవ్యాలను, ప్రత్యేకంగా హషీష్‌ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు దుబాయ్ కస్టమ్స్ గురువారం తెలిపింది. 'వీల్‌హౌస్'గా పిలువబడే ఈ ఆపరేషన్ దుబాయ్ క్రీక్ మరియు డీరా వార్ఫేజ్ కస్టమ్స్ సెంటర్లో జరిగిందన్నారు. దుబాయ్ కస్టమ్స్ టాస్క్ ఫోర్స్ 'సియాజ్' ఓడను నిశితంగా తనిఖీ చేసిందని, పరిమిత స్థలాలను పరిశీలించడానికి రూపొందించిన అత్యాధునిక పెరిస్కోప్ సాంకేతికతను ఉపయోగించిందని వివరించారు. కృత్రిమ మేధస్సు, పెరిస్కోప్ టెక్నాలజీ, డ్రోన్లు, కుక్కలు మరియు పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిషేధిత, ప్రమాదకరమైన పదార్థాల చొరబాట్లను ముందస్తుగా గుర్తించినట్లు తెలిపింది. దుబాయ్ సురక్షితమైనదిగా మలిచే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని, అంతర్జాతీయ వాణిజ్యంలో దుబాయ్ స్థానాన్ని బలోపేతం అవుతుందని డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్, పోర్ట్స్, కస్టమ్స్ మరియు ఫ్రీ జోన్ కార్పొరేషన్ చైర్మన్ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయం తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!