రియాద్‌లో టర్కిష్ సూపర్ కప్ రద్దు
- December 30, 2023
రియాద్: రియాద్‌లో ఫెనర్‌బాచే మరియు గలాటసరే మధ్య టర్కిష్ సూపర్ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్ రద్దు అయింది. ఈ మేరకు రియాద్ సీజన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రియాద్‌లోని అల్ అవ్వల్ పార్క్ స్టేడియంలో శుక్రవారం ఈ మ్యాచ్ జరగాల్సింది. రాజకీయ నినాదాలను ప్రదర్శించాలనే ఆయా జట్ల ఉద్దేశాల కారణంగా రద్దు అయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది సౌదీ హోస్ట్ అధికారులు నిర్దేశించిన షరతులకు అనుగుణంగా లేనందనున మ్యాచును రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈవెంట్ ర్గనైజింగ్ బాడీ అయిన రియాద్ సీజన్ స్పందించింది. ఏదైనా బాహ్య చిహ్నాలు లేదా నినాదాల ప్రదర్శనను నిషేధించే అంతర్జాతీయ ఫుట్‌బాల్ నిబంధనలకు కట్టుబడి ఉండటం ప్రాముఖ్యత మరోసారి గుర్తుచేసింది. స్టేడియంలో జాతీయ గీతాన్ని ప్లే చేయడం, టర్కీ జెండాను ప్రదర్శించడం ద్వారా టర్కీ జాతీయ చిహ్నాలను గౌరవించాలని నిర్వాహకులు అంగీకరించారు. అయితే, అంగీకరించిన నిబంధనలను జట్లు పాటించకపోవడం దురదృష్టకరమన్న నిర్వాహకులు.. ఈ వివాదం మ్యాచ్ రద్దుకు దారితీసిందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..