'కత్తిలాంటోడు' ఎన్ని ట్విస్ట్ లు!
- May 29, 2016
చిరంజీవి 150 వ సినిమాకు హీరోయిన్ గా అనుష్క ఎంపిక అయింది అని వార్తలు వచ్చి కొద్ది రోజులు కూడ గడవకుండానే మెగా స్టార్ కి అనుష్క స్ట్రోక్ తగిలింది అన్న వార్తలు వస్తున్నాయి. చిరంజీవి 'కత్తిలాంటోడు' సినిమాకు మొదటి షెడ్యూల్ కే అనుష్క షూటింగుకి వచ్చేస్తుందని అనుకుంటుంటే ఇప్పుడామె ఈ మూవీ నుంచి తప్పుకుంది అన్న వార్తలు వస్తున్నాయి.చిరంజీవి 150వ సినిమాలో నటించే విషయంలో అనుష్క ఆసక్తితోనే ఉన్నప్పటికీ డేట్లు సర్దుబాటు చేయడం కష్టమని నిర్ణయించుకున్నాక సారీ చెప్పేసిందని ఫిలింనగర్ టాక్. 'బాహుబలి-2' లాంటి ప్రతిష్టాత్మక చిత్రంతో పాటు అనుష్కకు 'సింగం-3', 'భాగమతి' లాంటి కమిట్మెంట్లు ఉన్నాయి. వీటి మధ్య చిరంజీవి సినిమాకు డేట్లు కేటాయించడం చాలా కష్టమని భావించి అనుష్క ఈ నిర్ణయంతీసుకుంది అని అంటున్నారు.ముఖ్యం గా 'బాహుబలి-2' డేట్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేక అనుష్క తప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. దీనితో చిరంజీవి సినిమాకు మళ్లీ హీరోయిన్ విషయంలో తలనొప్పి మొదలు అయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మొన్న ఆల్ ఇండియా ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి లుక్ చూసి అందరూ షాక్ అయి నట్లు వార్తలు వస్తున్నాయి.
లైట్ బ్లూ కలర్ షర్టులో మెరిసిపోయిన చిరంజీవిచేతికి పెట్టుకొచ్చిన వాచ్ డయల్ కలర్ కూడా సేమ్ రంగులో మెరిసిపోవడంతో అందరి దృష్టి చిరంజీవి లుక్ పై పడింది. గ్రే కలర్ ఫ్యాంటు వేసుకున్న చిరంజీవి కోటెడ్ మెరూన్-బ్రౌన్ షూ వేసుకుని తన 'కత్తిలాంటోడు' సినిమాకు కత్తి లా తయారు అయ్యాడు అన్న సంకేతాలు ఇచ్చాడు. అయితే చిరంజీవి కత్తి లాంటి లుక్ తయారు అయ్యింది కాని ఇంకా హీరోయిన్ రెడీ కాకపోవడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇక రానున్న రోజులలో ఈ హీరోయిన్ వ్యవహారం ఇంకా ఎన్ని ట్విస్ట్ లు తీసుకుంటుందో చూ డాలి..
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







