'యంగ్ టైగర్' చెన్నైలో సందడి..
- May 29, 2016
'యంగ్ టైగర్' జూనియర్ ఎన్టీఆర్ చెన్నైలో సందడి చేస్తున్నారు. తనను కలిసిన అభిమానులకు ఆనందాన్ని పంచారు. ఆయన ప్రస్తుతం 'జనతా గ్యారేజి' చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్యామేనన్‌లు ఆయన సరసన ఆడిపాడుతున్నారు. దీని చిత్రీకరణ కోసం ఇటీవల చెన్నై వచ్చారు. ఆదివారం జీహెచ్ ఎదురుగా ఉన్న మెమోరియల్ హాలు వద్ద చిత్రీకరణ సాగింది. ఉదయం నగరంలోని అభిమానుల సంఘం ప్రతినిధులు ఆయన్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కేకు కత్తిరించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జయలలితకు అభినందనలు తెలిపేందుకు ఆమె అపాయింట్‌మెంట్ కోసం ఎన్టీఆర్ వేచి చూస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఆమెను కలిసే అవకాశమున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







