రెండు రోజులపాటు దక్షిణాదిలో ప్రధాని మోడీ పర్యటన
- January 02, 2024
తిరుచిరాపల్లి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దక్షిణాదిన రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు తమిళనాడులో పర్యటిస్తున్నారు. తిరుచిరాపల్లిలో పర్యటించిన మోడీ భారతీదాసన్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన వర్సిటీలు ప్రపంచస్థాయి ర్యాంకులు సాధిస్తున్నాయిని అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచుకుని మంచి ర్యాంకుల్లో నిలుస్తున్నాయని మోడీ తెలిపారు. నేడు ప్రతి రంగం ఆవిష్కరణలు కోరుకుంటోంది అని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా రూ.19,850 కోట్లతో అభివృద్ధి పనులకు మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఏవియేషన్, రైలు, రోడ్డు, షిప్పింగ్ రంగాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ‘యువత అంటేనే సమాజ రూపురేఖలు మార్చే శక్తి. వర్సిటీల నుంచి వచ్చే యువత సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి. దేశంలోని విమానాశ్రయాలను పదేళ్లలో రెట్టింపు చేశాం. దేశంలోని 74 విమానాశ్రయాలను పదేళ్లలో 150కు పెంచాం. ప్రధాన పోర్టుల్లో కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం రెండింతలు చేశాం.’ అని మోడీ అన్నారు. మరోవైపు రెండ్రోజుల పర్యటనలో భాగంగా రేపు లక్షద్వీప్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. కవరత్తిలో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







