విజయవాడలో 100 పడకలతో సెంటినీ సిటీ హాస్పటల్
- January 02, 2024
విజయవాడ: పదిమందికి పైగా సూపర్ స్పెషాలిటీ వైద్యుల పర్యవేక్షణలో సెంటినీ సిటీ హాస్పటల్ వైద్య సేవలు నేటి నుండి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని సెంటినీ హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ డాక్టర్ మొవ్వ పద్మ తెలిపారు. 12 సంవత్సరాల క్రితం సెంటిని హాస్పిటల్ ను ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందామని తెలిపారు. సూర్యారావుపేటలోని కాళేశ్వరరావు రోడ్డులో సెంటినీ సిటీ హాస్పటల్ నందు మంగళవారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 24గంటలు వైద్యుల పర్యవేక్షణలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యుల నిపుణులచే ప్రజలకు చేరువగా నగరం నడిబొడ్డున ఈ వైద్య సేవలు లభ్యం అవుతాయని తెలిపారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో విజయవాడ నగరంలో మొట్టమొదటి సారిగా స్టార్ క్లాస్ డీలక్స్ రూమ్స్‌తో 24గంటలు పేషంట్లకు నాణ్యతాప్రమాణాలతో కూడిన వైద్యం అందిస్తామన్నారు. క్రిటికల్ కేర్ సర్వీసులు, పల్మనాలజీ, కార్డియాలజీ, మెడికల్ గ్యాస్ట్రో, సర్జికల్ గ్యాస్ట్రో, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, జనరల్ మరియు లేపరోస్కోపీ సర్జరీ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. మూడు ల్యామినర్ థియేటర్‌లలో అత్యాధునిక క్యాతల్యాబ్ మరియు 1.5 టెస్లా ఎమ్మారై వంటి అత్యాధునిక సౌకర్యాలన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రత్యేకతని డాక్టర్ మొవ్వ పద్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 గురు పల్మోనాలజీ & క్రిటికల్ కేర్ వైద్యుల యొక్క అతిపెద్ద బృందం సహాయంతో ఎంతటి క్లిష్టమైన, రోగులకు చికిత్స చేయగలదు.. పేద, మధ్యతరగతి వర్గాల వారికి సైతం కార్పోరేట్ తరహా వైద్యం అందిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో హాస్పటల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ మొవ్వ ఆనంద్, డైరెక్టర్ మొవ్వ విష్ణు, హాస్పటల్ సీఈవో సి.ఎల్.ఎన్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్మనాలజీ విభాగం నందు డాక్టర్ కె.అనీల్‌కుమార్, డాక్టర్ ఎస్.వి.శివప్రసాద్ రెడ్డి, క్రిటికల్ కేర్‌కు డాక్టర్ కొత్తపల్లి రామ్‌కుమార్, డాక్టర్ పి.కళ్యాణ్‌కుమార్, డాక్టర్ బి.జి.జస్వంత్ చౌదరి, కార్డియాలజీ విభాగం నందు డాక్టర్ నరాలశెట్టి అనీల్‌కుమార్, డాక్టర్ జె.నాగేశ్వరరావు, గ్యాస్ట్రో విభాగం నందు డాక్టర్ వీర అభినవ్ చింతా, న్యూరాలజీ విభాగానికి డాక్టర్ నవీన్ తోట, డాక్టర్ ఎల్.వి.రాంబాబు, జనరల్ మరియు జి.ఐ. సర్జరీలకు డాక్టర్ శ్రీహర్ష మానేపల్లి, ఎనస్థీషియా విభాగానికి డాక్టర్ సాయి, రేడియాలజీ విభాగానికి డాక్టర్ పవన్‌కుమార్ పొలగాని నేతృత్వం వహిస్తున్నారని వెల్లడించారు.

తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్‌లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







