హైదరాబాద్లో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
- January 02, 2024
హైదరాబాద్: హైదరాబాద్లోని పలు పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కమిషన్ రేటు పెంచాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి పెట్రోల్ ట్యాంకర్ యజమానులు సమ్మె చేయనున్నారు. ఈ నేపథ్యంలో బంకులలో పెట్రోల్, డీజిల్ లేదంటూ ఇప్పుడే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రేపటి నుంచి… సమ్మె విషయం తెలిసిన వాహనదారులు ఫుల్ ట్యాంక్ కొట్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు వరుస కడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చే పెట్రోల్ బంకులు పెరిగే అవకాశముంది.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







