Dh20-మిలియన్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు!
- January 02, 2024
యూఏఈ: అల్ ఐన్‌లో ప్రైవేట్ డ్రైవర్ అయిన భారతీయ ప్రవాసి మునావర్ ఫైరూస్.. నూతన సంవత్సరానికి ముందు జాక్‌పాట్ కొట్టాడు. తాజా బిగ్ టికెట్ లైవ్ డ్రాలో Dh20-మిలియన్ గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాడు. గత ఐదేళ్లుగా బిగ్ టికెట్ కొంటున్నట్లు మునావర్ తెలిపారు. తాను 30 మంది వ్యక్తులతో కలిసి టికెట్ ను కొన్నానని, ప్రైజ్ మనీని వారితో కలిసి షేర్ చేసుకోనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31 మధ్యాహ్నం జరిగిన లైవ్ డ్రాలో పది మంది భారతీయ, పాలస్తీనియన్, లెబనీస్ మరియు సౌదీ అరేబియా జాతీయతలకు చెందిన పది మంది అదృష్ట వంతులు విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరు Dh100,000 విలువైన నగదు బహుమతులు అందుకోనున్నారు.
అదే రోజు సుతేష్ కుమార్ కుమరేశన్ డిసెంబర్ నెలలో నాల్గవ వారపు ఇ-డ్రా విజేతగా పేరుపొందారు. దీని ద్వారా 1 మిలియన్ దిర్హామ్‌లు గెలుచుకున్నారు. ఎతిహాద్ ఎయిర్‌వేస్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అబుదాబి నివాసి తాను ప్రయాణించిన ప్రతిసారీ టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలోని స్టోర్ కౌంటర్‌ల దగ్గర ఆగినట్లు చెప్పారు. నగదుతో భారతదేశంలో ఒక ఇంటిని కొనుగోలు చేసాము మరియు వడ్డీని చెల్లించడానికి డబ్బును ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







